మహిళల ఆర్థిక స్వావలంబనకే ప్రాధాన్యం
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. జనకాపూర్లో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ తో కలిసి ప్రారంభించారు. మహిళా సంఘాలకు యూనిఫాం కుట్టు పనులు, వివిధ ఉపాధి అవకాశాల ద్వారా ఆదాయం పెంచే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి
తెలంగాణ ఓపెన్ స్కూల్ (TOSS) 202627 ప్రవేశాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ కె. హరిత ఆవిష్కరించారు. చదువు మధ్యలో నిలిపివేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
అంకుశపూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హరిత పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.
ఓటరు జాబితా సవరణలకు సహకరించాలి
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత కోరారు. కలెక్టరే ట్లో నిర్వహించిన సమావేశంలో ఎన్యుమరేషన్ ఫారాల్లోని పొరపాట్లను సరిచేసి అనా మలీస్ జాబితాను తగ్గించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలని సూచించా రు. ఆగస్టు 10లోపు సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.






