6 March, 2026 | 11:34 PM

బీకే గూడాలో ప్రెషర్ వాటర్ సప్లై సమస్యను వెంటనే పరిష్కరించాలి

06-03-2026 03:08 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): బి.కె.గూడా డివిజన్‌లో గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా లో ప్రెషర్‌తో రావడం, అలాగే సరఫరా సమయాల్లో మార్పులు రావడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ సనత్‌నగర్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఆకుల మహేష్ కుమార్ నాయకత్వంలో పలువురు పార్టీ నాయకులు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.






ఈ సందర్భంగా సీనియర్ నాయకులు లింగంపల్లి నర్సింగ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు), బీజేపీ జిల్లా ఐటీ ఇన్‌చార్జ్ అశ్విని, ప్రధాన కార్యదర్శి సుధాకర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు పి. నరేందర్, కుశాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బి.కె.గూడా ప్రాంతంలో తాగునీటి సరఫరాలో ప్రెషర్‌తో రావడం వల్ల ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.

వెంటనే సమస్యను పరిష్కరించి, పాత టైమింగ్ ప్రకారమే తాగునీటి సరఫరా నిర్వహించాలని అధికారులను కోరారు.ఈ మేరకు డీజీఎం ఆశిష్ మరియు మేనేజర్ మోనికాకి వినతిపత్రం అందజేశారు. సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానికులు శ్రవణ్, వాణి, రజిని, శోభన్ బాబు, అఖిల్, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.