రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న గర్భిణి
సురక్షిత ప్రసవం చేసిన ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి వైద్యులు
హైదరాబాద్, మార్చి 20(విజయక్రాంతి) : అరుదైన రక్తస్రావ వ్యాధితో బాధపడుతు న్న గర్భిణికి ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రి వారి ‘ఎం’బ్రేస్‘ మదర్ కేర్, చైల్ కేర్ అండ్ ఫెర్టిలిటీ వైద్యులు విజయవంతంగా ప్రసవం చేసి తల్లి, శిశువుల ప్రాణాలు కాపాడారు. సాధారణ జనాభాలో వంద మంది లో ఒకరికి, ప్రెగ్నెన్సీలో ఎంతో అరుదుగా కనిపించే ఈ తరహా వ్యాధి లక్షణాలు, యు వతి ప్రసవానికి, తీసుకున్న జాగ్రత్తలు చికిత్స నందించిన వివరాలను కామినేని ఆస్పత్రి వారి ‘ఎం’బ్రేస్‘ ప్రసూతి-గైనకాలజీ విభాగానికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ బి. మేనక వెల్లడించారు.
‘నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన ఓ కారు డ్రైవర్ భార్య సంగీత బ్లీడింగ్ సమస్యతో నాలుగేళ్లుగా బాధపడుతుంది. ఈ క్రమంలో సంగీత కామినేని ఆస్పత్రి ‘ఎం’బ్రేస్’ఔట్‌పేషెంట్ విభాగానికి వచ్చింది. ఆమెకు సంబంధిత గైనకాలజీ వై ద్యపరీక్షలు నిర్వహించగా ‘వాన్ విల్లి బ్రాండ్ వ్యాధిటైప్ 3’ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది.ఈ వ్యాధి వంశపారపర్యంగా వచ్చే జన్యు సంబంధితమైనదిగా.. ఫలితంగా రక్తస్రావం జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది.
ఆ సమయంలో ఆమెకు సంబంధిత చికిత్స, మెడికేషన్స్ ఇవ్వడం జరిగింది.గత కొన్ని నెలల కిందట మొదటిసారి గర్భం దాల్చిన.. 5వ నెలలో మళ్లీ ‘ఎం’బ్రేస్’ విభాగానికి వచ్చి నన్ను సంప్రదించారు. అప్పటి నుంచి వైద్యు ల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటుంది. అయితే రక్తస్రావ వ్యా ధితో పాటు గర్భధారణ సమయంలో ‘సెంట్రల్ ప్లాసెంటా ప్రీవియా’ అంటే.. గర్భాశ యంలోని పిండానికి పోషకాలు, ఆక్సిజన్ అందించే ‘మాయ’ అనేది కిందికి ఉండడంతో సమస్య ఇంకా క్లిష్టంగా మారింది.’ అని చెప్పారు.
‘ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్లాన్ చేసి సిజేరియన్ చేయాలని మేము నిర్ణయించినప్పటికీ, ముందుగానే అకస్మాత్తుగా బ్లీడింగ్ ప్రారంభమవడంతో అత్యవసరంగా సిజేరియన్ చేశాం. 2.24 కిలోల బరువుతో ఆరోగ్యవంతమైన మగ శిశువు జన్మించాడు. తల్లికి రక్త మార్పిడి (బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్)తో పాటు వాన్ విల్లిబ్రాండ్ ఫ్యాక్టర్, ఫ్యాక్టర్-3 మందులు అందించాం.ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రసూతి నిపుణులు, రక్త సం బంధిత వ్యాధుల నిపుణులు (హిమటాలజిస్టులు), అనస్థీషియా వైద్యులు, ట్రాన్స్ఫ్యూ షన్ మెడిసిన్ నిపుణులు, పిల్లల వైద్యులు ఇలా వివిధ విభాగాల వైద్యులం కలిసి విజయవంతంగా సురక్షిత ప్రసవం చేశాం. తల్లి- శిశువులు ఆరోగ్యంగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాం.’ అని డాక్టర్ బి. మేనక వివరించారు.
టైప్ 3 .. 50 లక్షల మందిలో ఒకరికి
వంశపారపర్యంగా వచ్చే జన్యు సంబంధిత వ్యాధి అరుదుగా ఉంటుందని, ప్రధా నంగా టైప్ 3 .. 50 లక్షల మందిలో ఒకరికి.. ప్రెగ్నెన్సీలో ఇదే తొలి కేసు అని డాక్టర్ బి. మేనక చెప్పారు. తన 25 ఏండ్ల కెరియర్లో ఇది మొదటి కేసు అని తెలిపారు.ఈ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా బ్లీడింగ్ ఎక్కువవ్వడం, దెబ్బ తగిలినా రక్త స్రావం ఆగకపోవడం, మౌత్ బ్లీడింగ్, ఏదైనా సర్జరీల సమయంలో హై రిస్క్ ఉంటుందన్నారు.




