20 July, 2026 | 8:39 PM

కీచక ట్రైనీ ఐపీఎస్!

20-07-2026 02:29 AM
  1. తోటి మహిళా ఆఫీసర్‌పై లైంగిక వేధింపులు
  2. తన గదిలోకి లాక్కెళ్లి.. మెడపై కత్తిపెట్టి..
  3. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్
  4. బాధితురాలి మొబైల్‌కు అసభ్యకర మెసేజ్‌లు
  5. హైదరాబాద్‌లో ఎస్‌వీపీఎన్‌పీఏలో ఘటన
  6. బీఎన్‌ఎస్, ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు

రంగారెడ్డి, జులై 19(విజయక్రాంతి): దేశంలోనే అత్యున్నత పోలీస్ అధికారులను తీర్చిదిద్దే ప్రతిష్టాత్మక హైదరాబాద్ శివరాంపల్లిలోని ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ’లో తీవ్ర కలకలం రేగింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని ఓ కీచక ట్రైనీ ఐపీఎస్ లైంగికంగా వేధించాడు. అంతేకాదు గదిలోకి లాక్కెళ్లి.. మెడపై కత్తిపెట్టి, ప్రైవేట్ వీడియోలు తీసి, బ్లాక్మెయిల్‌కు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలపై ఓ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఈ ఘటనకు సం బంధించి బాధితురాలి ఫిర్యాదుతో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనను కాలేజీ ఆవరణలో నిరంతరం వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో అకాడమీలో జూలై 9న నిందితుడు తనను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లాడని, జుట్టు పట్టుకుని మెడపై కత్తి పెట్టి బెదిరించాడని బాధితురాలు ఆరోపించారు.

అంతేకాకుండా, ఆమె ప్రైవేట్ వీడి యోలను బలవంతంగా చిత్రీకరించి, ఆమె మొబైల్ ఫోన్ లాక్కుని, ఆ వీడియోలను ఆమె భర్త వాట్సాప్‌నకు పంపాడని ఫిర్యాదులో వివరించారు. వాటిని సోషల్ మీడి యాలో పెడతానంటూ, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడినట్లు సదరు మహిళా అధికారిణి ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు ఉదయ్‌కృష్ణారెడ్డి బాధితురాలి మొబై ల్‌కు నిరంతరం అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ, నిలదీస్తే ఫోన్లలో తీవ్ర పదజాలం తో బూతులు తిడుతూ మానసిక క్షోభకు గురిచేసినట్లు తెలిసింది. ఉన్నత స్థాయికి చేరాల్సిన అధికారే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటంతో బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురై, చివరకు పోలీసులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన పోలీసులు

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యా దు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న అత్తాపూర్ పోలీసులు బాధితురాలి ఫిర్యాదను స్వీకరించారు. నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్లు 74, 75, 77, 315(2)తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66(సీ) కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం జాతీయ పోలీస్ అకాడమీ వర్గాల్లో సైతం తీవ్ర సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.