20-02-2026 01:22:26 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఫిబ్రవరి 19(విజయక్రాంతి): వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుం డా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష లో పైపులైన్లు, పంప్ హౌసుల మరమ్మత్తులు నెలలోగా పూర్తి చేయాలని, కెరమెరి మండలం ధనురా వద్ద డబ్ల్యూపిటి పనులను ఏప్రిల్లోగా పూర్తిచేయాలని సూచించారు.
నీతి అయోగ్ ఆధ్వర్యంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో వెనుకబడిన జిల్లాలకు మరిన్ని సేవలు అందించనున్నట్లు నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. న్యూఢిల్లీలో వర్చువల్గా ప్రారంభించిన నీతి తారా పథకం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె.హరిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కాగజ్ నగర్లో నూతన సర్పంచ్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.
అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి, వచ్చే విద్యా సంవత్సరానికి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.