5 June, 2026 | 8:02 PM

వర్షాకాలానికి ముందస్తు చర్యలు చేపట్టాలి

05-06-2026 06:39 PM

మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ యువజన నాయకులు

మణుగూరు,(విజయక్రాంతి): రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలని కోరుతూ  మున్సిపాలిటీ కమిషనర్ నాగ ప్రసాద్‌కు బీఆర్ఎస్ యువజన నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కమిషనర్‌ను కలిసిన మండల బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బోశెట్టి రవిప్రసాద్ మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. పట్టణంలోని ప్రధాన వాగు అయిన కట్టు వాగులో పూడికతీత పనులు చేపట్టడంతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో శుభ్రప రచాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా సుందరయ్య నగర్, ఆదర్శనగర్, గాంధీ నగర్, బాలాజీ నగర్, కాళీమాత ఏరియా వంటి లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువ లను శుభ్రపరచి నీటి నిల్వలు ఏర్పడకుం డా చర్యలు తీసుకోవాలని కోరారు. అలా గే డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటి అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం ఫాగింగ్ నిర్వహించాలని, పట్టణంలోని అన్ని వీధుల్లో క్రమం తప్పకుండా బ్లీచింగ్ మరియు శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలు వినియోగించే బావులు, నూతుల్లో బ్లీచిం గ్ పౌడర్ వేయించి తాగునీటిని శుద్ధి చేసే చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.