3 July, 2026 | 3:04 AM

పోలీసులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

03-07-2026 12:01 AM
  1. ట్రాఫిక్ ఏసీపీ జి.శంకర్ రాజ్
  2. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తిరుమలగిరిలో మెగా వైద్య శిబిరం

సికింద్రాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ట్రాఫిక్ పోలీసులు ఎండ,వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గంటల తరబడి రోడ్ల పై ప్రజల భద్రత కోసం నిరంతరం గా విధులు నిర్వహిస్తున్నారని ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజ్ అన్నారు.మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ బి.సుమతి, ఆదేశాల మేరకు, మల్కాజిగిరి ట్రాఫిక్-I డీసీపీ కె. రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ పోలీసులు ఆరోగ్యం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గురువారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుమలగిరి డివి జన్ ట్రాఫిక్ ఏసీపీ జి.శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని వైద్యులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు విధులు అత్యంత శారీరక శ్రమతో కూడుకున్నవని,ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరని తెలియజేస్తూ ప్రతి పోలీసు ఉద్యోగి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవా లని ఏసీపీ జి.శంకర్ రాజు సూచించారు.

ఈ మెగా వైద్య శిబిరంలో ఆరోగ్య,కంటి, దంత పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సలహాలు ఇవ్వడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ శిబిరంలో ట్రాఫిక్ పోలీసులు,సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈ వైద్య శిబిరంలో స్వచ్ఛందంగా సేవలందించిన వైద్యులకు ఏసీపీ జి.శంకర్ రాజు ఘనంగా శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శ్రీకర్ హాస్పిటల్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ భవాని, దామాయిగూడ రోడ్డులోని పద్మసాయి డెంటల్ క్లినిక్కు చెందిన డాక్టర్ దినేష్, డాక్టర్ శ్రేయ, ఈసీఐఎల్లోని రెటినోవా ఫౌండేషన్ (ప్లానెట్ ఆప్టిక్స్)కు చెందిన కె. భరత్ కుమార్ పాల్గొని నిస్వార్థంగా సేవలందించిన వైద్యులు, వైద్య బృందాలకు పోలీస్ శాఖ తరఫునపోలీస్ సిబ్బంది ఆరోగ్య సంక్షేమం కోసం అమూల్య మైన సేవలకు అందించిన వైద్య బృందానికి ఏసీపీ జి.శంకర్ రాజు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు,సబ్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.