27 March, 2026 | 2:24 PM

Breaking News

నేపాల్‌ ప్రధానిగా బాలేంద్ర షా.. పగ్గాలు చేపట్టిన అతిపిన్న వయస్కుడు   •   శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •   శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు   •   హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు   •  

డ్రగ్ కేసులో ముగిసిన పోలీస్ కస్టడీ

27-03-2026 12:28 AM

ఏప్రిల్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్

చంచల్‌గూడ జైలుకు రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్ శర్మల తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (విజయక్రాంతి): మొయినాబాద్ డ్రగ్స్, కాల్పు ల కేసులో అరెస్టయిన రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్ శర్మల సిట్ కస్టడీ గురువారంతో ముగిసింది. పోలీసులు నిందితులను న్యా యస్థానం ముందు హాజరుపరచగా.. కోర్టు వారికి ఏప్రిల్ 8వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో వారిని సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.

పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుం చి వచ్చాయి.. ఎవరు తీసుకువచ్చారు.. డ్రగ్స్ ముఠాతో ఉన్న సంబంధాలు ఏమిటి.. పార్టీ లో తుపాకీతో కాల్పులు జరిపింది ఎవరు.. తదితర కోణాల్లో కీలక సమాచారాన్ని సేకరించారు. కస్టడీ గడువు ముగియడంతో శంషాబాద్ పోలీస్ స్టేషన్లోనే వైద్యులు వారికి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ కోర్టుకు తరలించారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన అంశాలను సిట్ అధికారులు న్యాయస్థానానికి నివేదించారు.

మరింత విచారణ చేయాల్సి ఉందని, అందుకోసం నిందితులను మరో 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కస్టడీ పిటిషన్‌ను నిందితుల తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసుల పిటిషన్‌పై తాము కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు సమయం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితులకు ఏప్రిల్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కస్టడీ పిటిషన్‌పై విచారణను వాయిదా వేశారు. అనంతరం నిందితులను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.