ఫోక్సో కేసు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
మేడిపల్లి,(విజయక్రాంతి): బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసును విచారించిన నేరేడ్మెట్లోని అత్యాచారం, పోక్సో కేసుల ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. చీమల కొండూరు గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కాలా జాన్ (45) బోడుప్పల్ బొల్లి గూడెం లో నివసిస్తున్నడు.
అతని పై 2025లో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైం నంబర్ 279/2025 కింద కేసు నమోదైంది. కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూపాయలు 2 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు విలువరించింది. అలాగే బాధితురాలికి రూపాయలు 3 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు జరిపి నిందితుడికి శిక్ష పడేలా పక్క ఆధారాలు ప్రవేశపెట్టిన మేడిపల్లి పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.






