జిల్లాలో ప్రారంభమైన పెట్రోల్, డీజిల్ కష్టాలు
ఏ బంకుల చూసిన వాహనాల రద్దీ
డ్రమ్ముల్లో డీజల్ పెట్రోల్ తరలింపులు
పట్టించుకోని సివిల్ సప్లై అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏప్రిల్ 26, (విజయక్రాంతి): సుబ్బి పెళ్లి సావుకి వచ్చినట్టుంది. అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం సామాన్యుడిపై పేనుభారం మోపుతోంది. శుక్రవారం రాత్రి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరత తాండవిస్తోంది. జిల్లా వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ సరఫరా లేని కారణంగా పెట్రోల్ బంకుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
గంటల తరబడి పెట్రోల్ బంకల వద్ద పడికాపులు కావలసిన పరిస్థితి నెలకొంది. కొందరు డ్రమ్ముళ్లలో, పెద్ద పెద్ద క్యాలల్లో డీజిల్ ,పెట్రోలు మోస్తుండగా, వాహనదా రులు మాత్రం గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది . డిజిల్ చాలినంత సరఫరా కాకపోవడం వలన ఈ సమస్య ఉత్పన్నమైందని బంకు యజమానులు స్పష్టం చేస్తున్నారు. పెట్రోల్ కొరత లేదంటున్నారు.






