8 May, 2026 | 2:00 AM

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని వినతి

08-05-2026 12:00 AM

యాదగిరిగుట్ట, మే 7 : కొండపైన వర్తక సంఘంను రద్దుచేసి దుకాణాలను వేలం వేయాలని యాదాద్రి పరిరక్షణ సమితి సభ్యులు గురువారం ఈవో భవాని శంకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొన్నే ఏళ్లుగా కొత్త టెండర్లు లేకుండా వారి ఇష్టానుసారంగా రాజకీయ పలుకుబడితో వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని  కొత్తవారికి అవకాశం లేకుండా తక్కువ కిరాయిలతో దుకాణాలను నిర్వహిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా  రెన్యువల్  కాకుండా వీళ్ళ పలుకుబడితో అడ్డుకుంటున్నారు.

స్థానిక నిరుద్యోగులు  తక్కువ జీతాలకు దూర ప్రాంతానికి వెళ్లి పని చేస్తున్నారని, వర్ధక సంఘం వల్ల దేవస్థానానికి నష్టమే కాకుండా భక్తులను కూడా దోపిడికి గురి చేస్తూ  స్థానిక నిరుద్యోగులకు  ఉపాధి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇట్టి షాపులను  మే 31 లోపు  వేలం వేయకుంటే జూన్ 1 నుండి స్థానిక నిరుద్యోగులు అందరూ కొండపైకి వెళ్లి కొబ్బరికాయలు పూలు, పండ్లు, వస్త్రాలు  అమ్ముకుంటాం  అని ఈవో భవాని శంకర్  తెలియజేయడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సుడుగు జీవన్ రెడ్డి, కాటబత్తిని ఆంజనేయులు, దేవ పూజ అశోక్, గుండు నరసింహ , మిరియాల కృష్ణ,సతీష్ బట్టు, వంగపల్లి అరుణ్, బండి అనిల్, మందోజు నరేష్, కర్రె ప్రవీణ్, గుండు కుమార్,ఆరె కుమార్, కొనే ప్రశాంత్, గోపగాని ప్రసాద్, కర్రే శ్యామ్ పాల్గొన్నారు.