కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): మహాసభను విజయవంతము చేయడానికి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెలింపు కొరకు చలో హైదరాబాద్ కరీంనగర్ సెంటర్ నిర్వహించిన సన్నాహక సమావేశంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) 1941 సంవత్సరంలో, భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే స్థాపించబడిన దేశంలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక నిర్మాణ రంగ సంస్థలలో ఒకటి. గత 85 సంవత్సరాలుగా నిర్మాణ రంగ అభివృద్ధికి, కాంట్రాక్టర్ల హక్కుల పరిరక్షణకు, దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది.
డ్రెయినేజ్ పనుల నుండి డ్యామ్ల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖలలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, చెల్లింపులపై అనిశ్చితి కారణంగా కాంట్రాక్టర్లు మరియు వారి కుటుంబాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, బడ్జెట్కు అనుగుణంగా ప్రాధాన్యత గల పనులను కొనసాగించి, ప్రాధాన్యత లేని పనులను నిలిపివేసి, కాంట్రాక్టర్ల డిపాజిట్లు తిరిగి చెల్లించాలని మేము పలుమార్లు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మా ప్రధాన విజ్ఞప్తి ఏమిటంటే, పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను ఎటువంటి ప్రభావాలు, సిఫార్సులు లేదా వివక్ష లేకుండా క్రమ సంఖ్య (సీనియారిటీ) ఆధారంగా చెల్లించాలి.
ముందుగా పనులు పూర్తి చేసి, సంవత్సరాలుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. "ముందు వచ్చిన బిల్లుకు ముందు చెల్లింపు" అనే సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేయాలని మేము గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, కాంట్రాక్టర్ల సంఘం పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా మా అభిప్రాయాలను తగిన విధంగా పరిగణనలోకి తీసుకోలేదు.బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లకు పిలుపునిస్తూ, 2026 జూన్ 18న హైదరాబాద్లో నిర్వహించే "చలో హైదరాబాద్" కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతోంది






