12 July, 2026 | 6:04 PM

Breaking News

పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లింపు

31-03-2026 04:57 PM

మార్కెట్ అధికారులపై కఠిన చర్యలు

హైదరాబాద్: పసుపు రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) భరోసా కల్పించారు. తేమకు గురైన పసుపును కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని, తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని తుమ్మల పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెడితే మార్కెట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిజామాబాద్ మార్కెట్(Nizamabad Turmeric Market) కు పసుపు భారీగా వస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతులకు 1,500 టార్పాలిన్లు పంపిణీ కోసం బిడ్డింగ్ పూర్తి చేశామని తెలిపారు. పసుపు కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మేలు రకం పసుపు పంటకు ప్రభుత్వం ఖరారు చేసిన ధర చెల్లించాలన్నారు. రైతులకు చెల్లింపులు సక్రమంగా జరగాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.