10 May, 2026 | 4:24 PM

పేదల ఇంటి కలను నిజం చేస్తున్న నాయకుడు

10-05-2026 03:06 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కౌన్సిలర్ రాపర్తి కార్తిక్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పట్టణంలోని సందీప్‌నగర్ 11వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జంబోజు తిరుపతి  ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్లాబ్ కార్యక్రమాన్ని 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తిక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ రాపర్తి కార్తిక్ మాట్లాడుతూ... వార్డులో ప్రతి అర్హత గల కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. పేదల ఇంటి కలను నిజం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  నాయకులు గడ్డం గౌతమ్, పోలిశెట్టి చంద్రశేఖర్, సోమ శ్రావణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.