calender_icon.png 5 February, 2026 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యసభలో మాటల యుద్ధం

05-02-2026 12:06:37 PM

నన్ను మాట్లాడనివ్వడం లేదు

న్యూఢిల్లీ: రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే(LoP Mallikarjun Kharge) మాట్లాడుతూ.. తనను మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. అందరికీ అవకాశం ఇస్తున్నానని రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఖర్గేకు.. ఛైర్మన్ తగినంత సమయం ఇచ్చారని కిరణ్ రిజిజు వెల్లడించారు.

నిబంధనల ప్రకారమే రాజ్యసభను నడుపుతున్నామని రిజిజు పేర్కొన్నారు. అందరికీ ఒకేసారి సమయం కావాలంటే ఎలా? అని రాజ్యసభ చైర్మన్(Rajya Sabha Chairman) ప్రశ్నించారు. మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విపక్ష నేతకు సభలో తగిన గౌరవం ఇవ్వాలని డీఎంకే ఎంపీ శివ డిమాండ్ చేశారు. సభలో ఖర్గే మాజీ సైన్యాధిపతి నరవణె పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేశారు. అనధీకృత సమాచారం సభలో చదవడం కుదరదని చైర్మన్ హెచ్చరించారు. సభలో ఏ విషయం పైనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని జేపీ నడ్డా స్పష్టం చేశారు.