బెజ్జంకిలో పంచాంగ శ్రవణం
బెజ్జంకి, మార్చి 19:ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో సంప్రదాయబద్ధంగా పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రము లో పూజారి మధుసూదనాచారి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సరానికి సంబంధించిన పంచాంగ ఫలితాలను వివరంగా వివరించి, రాశుల ఫలితాలు, గ్రహ స్థితులు, వ్యవసాయం, వర్షపాతం,
ఆర్థిక పరిస్థితులపై సూచనలు అందించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా విని పించారు. పూజారి కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న ,ఆల యకమిటి చైర్మన్ జెల్ల ప్రభాకర్,శ్రీనివాస్ రెడ్డి,లక్ష్మణ్, ఉప సర్పంచ్ మహేష్,ప్రభాకర్,గుందయ్య వార్డు సభ్యులు గ్రామ ప్రజాలు పాల్గొన్నారు.




