12 June, 2026 | 3:44 AM

రెవెన్యూకు సొంత భవనాలు

12-06-2026 01:09 AM
  1. తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలు   
  2. రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనాలో నిర్మాణం
  3. మంత్రి పొంగులేటి వెల్లడి

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిని హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ని ర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయ న వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

శిథిలావస్థకు చేరిన, పాలనకు అనువు గా లేని భవనాల వివరాలను సేకరించారు. మంత్రి మాట్లాడుతూ.. తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు చాలా చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సౌకర్యవంత మైన, పారదర్శ కమైన పాలన అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదన్నారు. ప్రజలకు సేవలం దించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణ యం తీసుకున్నామన్నారు.

మొదటి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలను ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని తెలిపారు. ఇందుకు అనువైన స్థలాలను తక్షణమే గుర్తిం చి పనులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవ నాలను ఒకే నమూనాలో నిర్మిస్తామని, ము ఖ్యమంత్రితో చర్చించి డిజైన్లకు తుదిరూపు ఇస్తామన్నారు. తక్కువ ఖర్చుతో భవనాల ని ర్మాణం ఉంటుందన్నారు. మరమ్మతులు అవసరమైన భవనాలకు సంబంధించి నివేదికలు అందజేయాలని రెవెన్యూ సెక్రటరీని ఆదేశించారు. 

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలకు..   

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో కూడిన సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి, మేడ్చల్-- మల్కాజిగిరి, పఠాన్ చెరువు, కోహెడలో పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల సంఖ్యకు అనుగుణంగా భవనాలు నిర్మిస్తామని, అన్నీ ఒకే నమూనాలో నిర్మించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. క్యూర్ పరి ధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం స్థలాలను గుర్తిస్తున్నామని, త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి సమీక్షించనున్నట్లు వెల్లడించారు. 

ముందుచూపు లేకుండా మండలాల పునర్విభజన

గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా మండలాల పునర్విభజన చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని మండలాలు రెండుమూడు జిల్లాల పరిధిలో ఉన్నాయన్నారు.  మండల కార్యాలయాల్లో కనీస వసతులు లేవని, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పాలన ను బలోపేతం చేశామని తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి లోకేష్‌కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్  పాల్గొన్నారు.