ఎస్‌ఐఆర్‌కు నాలుగు రోజులే గడువు
06-08-2026 01:51 AM
కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 5(విజయక్రా ంతి): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్ ) కార్యక్రమానికి కేవ లం ఐదు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని, అర్హులందరూ ఆ గస్టు 10వ తేదీలోపు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
ఓటరు జాబితాలో ఇప్పటికే పేరున్న వారు కూడా చిరునామా, వయస్సు, ఇతర వివరాల్లో తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవాలి. ఫారాల స్వీకరణ, సందేహాల నివృత్తి కోసం ఈఅర్‌ఓ లు, ఏఅర్‌ఈఓ లు, బీఎల్ ఓ లు అందుబాటులో ఉంటారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ తక్షణమే ఫారాలు సమర్పించి ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ సూచించారు.






