కామారెడ్డి బీభత్సవానికి ఏడాది పూర్తి
- నష్టం నుంచి నేటికీ తేరుకోలేని ప్రజలు
- బాధితులకు నష్టపరిహారం సున్న
- ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు లేవు
- సీఎం హామీ ఇచ్చిన మరమ్మతులకు నోచుకోని వైనం
కామారెడ్డి, ఆగస్టు 27 (విజయక్రాంతి): గత ఏడాది భారీ వర్షాలకు కామారెడ్డి లోని జి ఎస్ ఆర్, హౌసింగ్ బోర్డ్, కౌండిన్య ఎంక్లేవ్ లోకి భారీ వరద నీరు చేరి తీవ్రనష్టాన్ని మిగిల్చిన విషయం విధితమే. ఇండ్లలోకి భారీ వరద నీరు చేరి కట్టుబట్టలతో ప్రాణాల ను అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చిన విషయం విధితమే.
ఎన్ డి ఆర్ ఎస్ బృందాలు, అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది, పోలీస్ అధికారులు ఎంతో శ్రమపడి ఇండ్లలో చిక్కుకున్న వారిని రక్షించారు. ఏడాది గడిచిన బాధితులకు మాత్రం నష్టపరిహారం అందలేదు. ఊహించని నష్టాన్ని చవిచూచిన ప్రజలకు ఆ షాక్ నుంచి నేటికీ తేరుకోలేదు. ఊహించాన్ని నష్టాన్ని చవి చూసిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి భరోసా కల్పించిన నష్టపరిహారాన్ని మాత్రం ఇప్పటికీ అందించలేదు.
రోడ్లు ధ్వంసమైన వాటి మరమ్మతులు నేటికీ పూర్తికాలేదు. గత ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి పర్వదినం రోజు భారీ వరద నీరు పెద్ద చెరువు నుంచి వచ్చి సమీపంలో ఉన్న జి ఎస్ ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కౌండిన్య కాలనీ ప్రజల ను కోలుకోలేని విధంగా ప్రకృతి దెబ్బతీసింది. కేవలం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ఇంట్లోని సర్వం వస్తువులు వరద నీటికి బురదలో చిక్కుకొని నష్టపోయారు. ప్రభుత్వం మాత్రం ప్రజలకు హామీలు ఇచ్చి చేతులు దులుపుకుంది. తక్షణ సాయం కింద తాత్కాలికంగా ఒక ఇంటికి 14000 రూపాయలు అందించి నిత్యవసర వస్తువులను అందించారు.
ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేదు
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాల వద్దకు వచ్చి భరోసా కల్పించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేవలం తక్షణ సహాయం కింద 14000 ఇంటికి ఇచ్చి చేతులు దులుపుతున్నారు. నేటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధితులకు నష్టపరిహారం ఇప్పించడంలో విఫలమయ్యారు.
ధ్వంసమైన రోడ్లు,
కామారెడ్డి లోని జి ఎస్ ఆర్ కాలనీ, ఎన్ జి ఓ ఎస్ కాలనీ, కౌండిన్య కాలనీలో భారీగా వచ్చిన వరద నీటి వల్ల రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. మరమ్మతులు చేపడతామని చెప్పిన అధికారులు హామీలు ఇచ్చి చేతులు దులుపుతున్నారు. ఏడాది అవుతున్న కనీస మరమ్మత్తులు చేపట్టలేదు.






