26 April, 2026 | 7:29 AM

గోదారి గట్టుపైన రొమాంటిక్ వైబ్‌లో..

26-04-2026 12:52 AM

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. ఈ సినిమాను సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొ డక్షన్స్ నిర్మించింది. ఇందులో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగ పతిబాబు కీలక పాత్ర లో కనిపించనున్నారు. రాజీవ్ కనకాల, లైలా, దేవిప్రసాద్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రో హిత్ కృష్ణ వర్మ ఇతర ము ఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 8న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.

ట్రైలర్‌ను ఏప్రిల్ 27న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాయకానాయికలు సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ క్యూట్ రొమాంటిక్ వైబ్‌తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పీ, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు.