మంచి సినిమాలకు ఎలాంటి సరిహద్దులుండవ్
‘వాలా 2’ సక్సెస్ మీట్‌లో హీరోలు సాయి ధరమ్ తేజ్, నిఖిల్ సిద్ధార్థ
సావిన్ ఎస్‌ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వీ వంటి యువ నటీనటులు ప్రధాన తారాగణంగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘వాలా 2’. కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ యూనానిమస్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌లో నిర్వహించారు.
ఈ వేడుకకు హీరోలు సాయిదుర్గతేజ్, నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సక్సెస్ మీట్‌లో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. “మంచి సినిమాకు ఎలాంటి సరిహద్దులుండవు. సాహు ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. తెలుగులో కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “నేను ఈ సినిమా థియేటర్‌లో చూశాను.
మెల్లగా థియేటర్ మొత్తం హౌస్‌ఫుల్ అయింది. ఇది పెద్ద సక్సెస్. ఒక ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడం అంత ఈజీ కాదు. మలయాళంలో పెద్ద హిట్. తెలుగులో ఇంకా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సావిన్ ఎస్‌ఏ, నిర్మాత సాహు గారపాటి, నటీనటులు హషీర్, అలన్, మరియా, వినాయకన్, దేవరాజ్ మాట్లాడారు. చిత్రబృందం పాల్గొన్నారు.






