ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నూతన కమిటీ ఏర్పాటు
కరీంనగర్ క్రేమ్,(విజయక్రాంతి): కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఎన్.ఎఫ్. ఐ. డబ్ల్యూ సీనియర్ నాయకురాలు గూడెం లక్ష్మీ తెలిపారు. జిల్లా అధ్యక్షురాలుగా బీర్ల పద్మ, జిల్లా ఉపాధ్యక్షరాలుగా రాగుల రేణుక, కాట్నపెల్లి అఖిల, జి.వాణి,ప్రధాన కార్యదర్శిగా కొట్టె అంజలి, జిల్లా సహాయ కార్యదర్శులుగా కందుకూరి సావిత్రి, నక్క కేతవ్వ, ఎలిశెట్టి భారతి, కోశాధికారిగా ర్యాకం మల్లికలతో పాటు మరో ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు గూడెం లక్ష్మీ తెలిపారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు బీర్ల పద్మ,ప్రధాన కార్యదర్శి కొట్టె అంజలి మాట్లాడుతూ... మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని, సంఘటిత, అసంఘటిత రంగాల్లో చాలీ, చాలని వేతనాలతో, అసమానలతో, వివక్షతతో పనిచేస్తున్న మహిళలకు అండగా ఉంటామని, మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని పాలక వర్గాలపై పోరాడుతామని, అత్యాచారాలకు, హత్యలకు, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలకు అండగా ఉంటామని, భారత జాతీయ మహిళా సమాఖ్యను జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పద్మ,అంజలి తెలిపారు.




