పసిడి ధరల్లో ఊగిసలాట!
దేశంలోని మెట్రో నగరాల్లో పెరిగిన ధరలు
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాం తి): అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరల్లో ఊగిసలాట పలువురిని ఆందోళన పరుస్తుంటే, పలువురిని సంతోష పెడుతుంది. ఏదేమైనా మహిళల మనసు దోచుకునే పసిడి నిమిష నిమిషానికి ఒక్కో తీరున పడిలేస్తూ సముద్ర తీరంలోని కెరటాల్లా హెచ్చుతగ్గులు నమోదు చేస్తుంది. ముడిచమురు ధరలు మార్కెట్లలో పుంజుకోవడంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగులు నమోదవుతున్నాయి.
మంగళవారంనాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయంగా 2 నుంచి 4 శాతం మేర నష్టాలు వాటిల్లాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 కెరట్లకు (గ్రాముకు) రూ. 14,035, 22 కెరట్లకు రూ.12,865, రూ. 470, రూ. 430 పెరుగుదల నమోదైంది. అదే సమయంలో ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మాదాబాద్, కోల్‌కతా, జైపూర్, పూణేలాంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ వడ్డీ రేట్ల కోత, యూఎస్ స్థూల ఆర్థిక డేటా కూడా బంగారం ధర ఒడిదుడుకులకు కారణమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.




