కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కొత్త నియామకాలు
హన్వాడ : మండలంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో పలు కీలక నియామకాలు(Appointments) చేపట్టారు. హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ(Congress party) అధ్యక్షులు వి. మహేందర్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా కన్వీనర్, బీసీ సెల్ చైర్మన్ నియామక పత్రాలను అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా బ్యాగరి అరేందర్‌ను మండల సోషల్ మీడియా కన్వీనర్‌గా, కర్రెల్ల తిరుపతయ్యను బీసీ సెల్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులను అందించారు.
పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి, కార్యకర్తల సమన్వయంతో కాంగ్రెస్ బలపర్చడంలో ఈ నియామకాలు కీలకంగా మారుతాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు వేముల కృష్ణయ్య, కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్యతో పాటు నాయకులు యాదిరెడ్డి, నర్సింహులు, జే. వెంకటయ్య, దాసరి రఘు, కొండ నారాయణ, వెంకటయ్య, కార్యకర్తలు హాజరయ్యారు.






