సీఎం పర్యటనలో అలసత్వం సహించం
03-07-2026 12:00 AM
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్
ఊర్కొండ / కల్వకుర్తి, జూలై 2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4న ఊర్కొండపేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పర్యటన నేపథ్యంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హెచ్చరించారు. గురువారం జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్తో కలిసి ఆలయం, హెలిప్యాడ్, సీఎం ప్రయాణ మార్గం, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
రైతు వేదికలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






