23 June, 2026 | 4:02 AM

నీట్ అభ్యర్థులకు అండగా నార్కట్‌పల్లి పోలీసులు

23-06-2026 01:08 AM

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ 

చిట్యాల, జూన్ 22: జిల్లాలోని నార్కట్పల్లి పోలీసులు మానవత్వాన్ని చాటుకుంటూ ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులకు అండగా నిలిచారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోలేని విద్యార్థులను తమ పోలీసు వాహనాలపై చేర్చి సహాయం చేశారు. దీంతో పలువురు విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాయగలిగారు. నార్కట్పల్లి పోలీసుల ఈ సేవలకు సంబంధించిన వీడియోను నల్లగొండకు చెందిన డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్కు ట్యాగ్ చేశారు.

వీడియోను వీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన పోలీసులను అభినందించారు. ‘వీరు అవార్డుకు అర్హులు‘ అంటూ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. డీజీపీ అభినందనలతో నార్కట్పల్లి పోలీసుల సేవలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం బాధ్యతగా వ్యవహరించిన పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.