8 July, 2026 | 8:04 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నేమ్ బోర్డు వితరణ

23-02-2026 07:42 PM

నాగారెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని చీనూరు గ్రామానికి చెందిన మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి సోమవారం రూ.10 వేలతో కాలేజ్ నేమ్ బోర్డ్, స్వతంత్ర సమరయోధుల ఫోటోలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదివి పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించి ఉత్తీర్ణులు కావాలని కోరారు.

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలలో అత్యధిక మార్కులు సాధించి టాపర్గా నిలిచిన విద్యార్థులకు రూ.5 వేల చొప్పున బహుమతులను అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  నరేందర్ మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.