calender_icon.png 13 February, 2026 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తారుమారైన, మున్సిపల్ ఎన్నికలు

13-02-2026 01:54:41 PM

  1. కాంగ్రెస్ గెలిచింది,కారు పంచర్ అయింది కమలం వాడిపోయింది
  2. పది స్థానాలతో ప్రభుత్వానికే పట్టం కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
  3. ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే మహా ప్రయత్నం
  4. ఒక వార్డు కైవసం, ఖాతా తెరవని బిజెపి
  5. రాష్ట్ర నాయకులు ప్రచారం గలిలో చూపని ప్రజల మమకారం

ఎల్లారెడ్డి, (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో ఎంతో కష్టపడిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు 12 వార్డుల్లో ఒక్క వార్డు మాత్రమే ప్రజలు మమకారం చూపించి బిఆర్ఎస్ నాయకులు గెలిపించుకున్నారు. ముమ్మర ప్రచారం, చేసిన, ప్రజలు సానుభూతి చూపకపోవడం, పట్ల ఎల్లారెడ్డి పట్టణంలోని మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గెలుపు ఓటమికి నాంది అని, అంటూ ఒకవైపు వసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఖాతా తెరవని బిజెపి 

భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రారంభమైన నుండి రెండో టర్ములో కూడా ఒక్క వార్డ్ లో కూడా ఇప్పటికీ ఖాతా తెరవకపోవడం నాయకుల నిర్లక్ష్యమే దీనికి నిదర్శనమని పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వెదజల్లుతుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో నిధులు అందించినప్పటికీ భారతీయ జనతా పార్టీ గల్లీలో గెలవకపోవడం కారణమేమిటని పలువురు భాజపా నాయకుla నిర్లక్ష్యమే దీని కారణమని పలువురు ప్రజలు మండిపడుతున్నారు. 

12 స్థానాలకు పది స్థానాలు గెలుపే ధీమా 

అధికార కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో 12 స్థానాల్లో పోటీ చేసి ప్రభుత్వం అధికార పార్టీ అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ చేసిన సేవలు కృషి పట్ల ప్రజలు మొద్దులై సంతృప్తి చెంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పై ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన పజలను ఏ విధంగా మార్చలేరని ప్రజలకు ప్రభుత్వం పై ఎంతో నమ్మకం ఉందని అందుకే ప్రజలు 10 వార్డులకు పట్టం కట్టారని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. 

రోడ్డుపై బైఠాయించడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం అంటూ ఎన్నో నిందలు వేసి ప్రజల మధ్యలో చేరి తప్పుడు ప్రచారం చేసిన వారికి ప్రజలు నేడు బుద్ధి చెప్పారని ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలే నేడు గెలుపుకు నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతాయని ఇందిరమ్మ ఇండ్లు ఆసరా పెన్షన్లు పేదవారికి బియ్యం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అలాగే రైతులకు రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రజల పక్షాన ప్రభుత్వం ఉన్నదని అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రకటనలో తెలిపారు.