6 July, 2026 | 2:48 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ప్లేఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్

22-05-2025 12:18 AM
  1. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం
  2. రాణించిన సూర్యకుమార్.. బౌలర్ల సమిష్టి ప్రదర్శన

ముంబై, మే 21: ఐపీఎల్-18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్ప టికే ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ౧౧వ సారి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టడం విశేషం. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్) కీలక ఇన్నిం గ్స్‌తో అలరించగా.. తిలక్ వర్మ (27), రికెల్‌టన్ (25), నమన్ దిర్ (24 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై పరాజయం చవి చూసింది. సమీర్ రిజ్వీ (39) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విప్రజ్ నిగమ్ (20) పర్వాలేదనిపించాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.