calender_icon.png 19 February, 2026 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు

19-02-2026 01:37:34 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం యూసుఫ్ గూడలోని ముహమ్మద్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య ఆహ్వానితులుగా పాల్గొన్నారు. యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ, వెంగళరావునగర్ డివిజన్లకు చెందిన 45 మంది లబ్ధిదారులకు సుమారు రూ.45,05,000 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డల పెళ్లిళ్లు పేద కుటుంబాలకు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం ఈ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్ర మంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.