28 July, 2026 | 1:48 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

బస్సులను తనిఖీ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్

06-06-2026 01:30 AM

షాద్నగర్, జూన్ 5(విజయక్రాంతి): నూ తన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సి. స్వప్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచించారు. శుక్రవారం  షాద్నగ ర్ పరిధిలోని పలు ప్రైవేటు పాఠశాలల బ స్సులను అధికారులు  తనిఖీ చేశారు. తనిఖీ ల సందర్భంగా బస్సుల ఫిట్నెస్, బ్రేకులు, టై ర్లు, అత్యవసర ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ బా క్స్, అగ్నిమాపక పరికరాలు తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.

విద్యార్థులను రవాణా చేసే వాహనాలు పూర్తిస్థాయి ఫిట్నె స్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దా రితీసే అవకాశం ఉందని స్వప్న హెచ్చరించా రు. పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ని ర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్ర భుత్వం నిర్దేశించిన రవాణా భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూ చించారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణమే ప్రధాన లక్ష్యమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.