ఏసీబీ వలలో మొలంగూర్ జీపీవో
21-08-2026 12:22 AM
- రైతును రూ.20వేలు డిమాండ్ చేసిన శ్రీనివాస్
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఘటన
కరీంనగర్, ఆగస్టు20(విజయక్రాంతి): ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న జీపీవోఓను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ అనంతరం వాంగ్మూలాలు తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఓ రైతు వద్ద లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు కరీంనగర్ రేంజ్ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆద్వర్యంలో ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం జీపీఓను పట్టుకున్నారు. ఫినాప్తలిన్ పరీక్షలు నిర్వహించిన అధికారులు కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు.






