1 May, 2026 | 10:37 AM

ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి

16-03-2026 08:36 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): హిందువులను కించపరిచే విధంగా అనుచిత వాక్యాలు చేశారని ఆరోపిస్తూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వ్యాఖ్యలను ఖండిస్తూ  బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ లోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన బీజేవైఎం నాయకులు కోడిగుడ్లు, టమాటాలతో సామెల్ ఇంటిపై దాడి చేశారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ..  తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో మా ఆలయాల వద్దకు వచ్చి నన్ను గెలిపించాలని దండాలు పెట్టి హిందువుల ఓట్లతో  ఎమ్మెల్యేగా గెలిచిన సామెల్  హిందువులను కించపరిచే విధంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు.. ఎమ్మెల్యే వెంటనే బేషరతుగా హిందువులకు  క్షమాపణ చెప్పాలని, లేకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మేడిపల్లి పోలీసులు బీజేపీ, బీజేవైఎం నాయకులను అడ్డగించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.