22 June, 2026 | 11:13 PM

బాన్సువాడ బాలికల జూనియర్ కళాశాలకు మరోసారి ఘనత...

22-06-2026 08:45 PM

సిఎస్ గ్రూపులో శివాని 499 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో మెరిసిన ప్రతిభ...

ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో త్రిషకు 978 మార్కులు...

విద్యార్థినులు,అధ్యాపకులను అభినందించిన ఎమ్మెల్యే పోచారం..

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఎమ్మెల్యే,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో త్రిష 978 మార్కులు సాధించి ప్రతిభ చాటగా, ప్రథమ సంవత్సరం సీఎస్ గ్రూపులో శివాని 499 మార్కులు,హెచ్‌ఈసీ గ్రూపులో లక్ష్మి 484 మార్కులు సాధించి ఉత్తమ ఫలితాలు నమోదు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను,అధ్యాపక బృందాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ... భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించి కళాశాల ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫరూక్ బామ్మధి మాట్లాడుతూ... విద్యార్థినుల కృషి అధ్యాపకుల అంకితభావం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థినులు మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు.