22 June, 2026 | 10:43 PM

సర్టిఫికెట్ల వెరిఫికేషన్

22-06-2026 08:48 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో (TGCHE), TG EAPCET–2026 ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారు. జిల్లా పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనను పూర్తి చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ (FAC) డా. ఎం. దేవేందర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్  సజావుగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

కౌన్సెలింగ్ ఇన్‌చార్జ్ మధుకర్, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్  డి. రాందాస్ వెరిఫికేషన్ అధికారులు, హెల్ప్ డెస్క్ సిబ్బంది, ఫ్లో కంట్రోల్ సిబ్బంది అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన సేవలు అందించారు. కళాశాలలో అభ్యర్థుల నమోదు, ధ్రువపత్రాల పరిశీలన, వెరిఫికేషన్, ఫ్లో కంట్రోల్, మార్గదర్శకత్వం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు తాగునీరు, వేచివుండే సౌకర్యాలు, సహాయ కేంద్రాలను కల్పించారు.