చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
20-08-2026 09:43 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇల్లందు నియోజకవర్గానికి చెందిన పలువురు బాధితులను ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించారు. కోయగూడెం గ్రామ పంచాయతీ దంతెల తండాకు చెందిన బోడ శ్రీకాంత్, ఎర్రాయిగూడెం గ్రామ పంచాయతీ చింతలకట్టకు చెందిన ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారిని పరామర్శించారు.
వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్ కూడా బాధితులను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.






