14 April, 2026 | 3:47 PM

భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె

14-04-2026 11:17 AM

దమ్మపేట, (విజయక్రాంతి): మండల పరిధిలోని జగ్గారం, మల్లారం గ్రామాల్లో ఈ నెల 15వ తారీఖు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలోసబ్‌స్టేషన్‌ల శంకుస్థాపన కార్యక్రమాలను పురస్కరించుకుని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మండల అధికారులతో కలిసి  సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థల పరిశీలనతో పాటు ఏర్పాట్లను పర్యవేక్షించారు.