5 August, 2026 | 7:55 PM

వివో సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

05-08-2026 06:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్హెచ్జీ (SHG) విఓ భవనాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. రూపాయలు 10 లక్షలతో ఈ భవనం నిర్మించినట్లు తెలిపారు. మాట్లాడుతూ... మహిళా సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.

మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి చేస్తుందన్నారు కఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోండుగారి చైతన్య శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ , మండల  అద్యక్షులు నర్సారెడ్డి,  బీజేపీ సీనియర్ నాయకులు  ముత్యం రెడ్డి , BJYM జిల్లా అద్యక్షులు నిరంజన్ రెడ్డి తో పాటు  మహిళా సమైక్య సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.