26 March, 2026 | 1:46 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!

26-03-2026 12:17 PM
  1. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో అవినీతి
  2. టీచింగ్ కాలేజీల నిర్వహణ.. గ్రూప్ అధికారులకు
  3. రాజీవ్ ఆరోగ్య శ్రీ బకాయిలు గత ప్రభుత్వానివే
  4. ఆరోగ్య శ్రీపై విపక్షాల ఆరోపణలు సరికాదు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. . ఆరోగ్య శ్రీపై విపక్షాల ఆరోపణలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) గత ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajiv Aarogyasri) రూ. 600 కోట్లు బకాయిలు పెట్టిందని తెలిపారు. ఇప్పటివరకు రూ. 2408,51 కోట్లును ప్రజా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లిస్తూనే ఉన్నామన్నారు. పేదలకు అన్యాయం జరుగుతోందంటూ అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు రూ. 927 కోట్లు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 1,480 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల(CMRF Cheques) విషయంలో అవినీతి(CMRF Corruption) జరిగిందని సీఎం ఆరోపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా దుర్వినియోం చేశారో తెలుసన్నారు. ఎవరి పీఏలు సీఎం రిలీఫ్ ఫండ్ కాజేశారో కూడా తెలుసని సీఎం చెప్పారు. విచారణ జరుగుతోందని అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. రూ. 2046 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశామని పేర్కొన్నారు.  27 నెలల్లో పేదల వైద్యం కోసం రూ. 4500 కోట్లు  చెల్లించామని తెలిపారు.

టీచింగ్ కాలేజీలకు రోగులు వెళ్లట్లేదని సీఎం వెల్లడించారు. టీచింగ్ కాలేజీల నిర్వహణ గ్రూప్ 1 అధికారులకు అప్పగిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకం తీసుకువచ్చామని వివరించారు. విదేశాల్లో నిపుణులైన వైద్యల సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఉపయోగించుకోవాలని ఆలోచిస్తోందన్నారు. గోషామహల్ లో 30 ఎకరాల్లో రూ. 3 వేల కోట్లతో 2 వేల పడకలతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మించుకుంటున్నామని పేర్కొన్నారు. డాక్టర్లపై పని ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆస్పత్రి, సిబ్బంది పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు. 2 వేల