6 August, 2026 | 4:23 AM

సీఎం ఫొటో దుర్వినియోగం

06-08-2026 12:00 AM

తెలంగాణ టైగర్ పేరు..

రేవంత్ రెడ్డి ఫొటోతో హల్‌చల్ 

రంగారెడ్డి,ఆగస్టు 5 : దిల్‌సుఖ్ నగర్ రోడ్లపై తెలంగాణ టైగర్ పేరుతో ఓవర్ స్పీడ్ తో కారు హల్ చల్ చేస్తోంది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో స్టిక్కర్ ఉన్నది. కారు వెనుక అద్దంపై సీఎం రేవంత్ రెడ్డి ఫొటో రేడియం స్టిక్కర్ ఉన్నది. అదే విధంగా అద్దంపై ఎడమవైపు అడ్వకేట్ సింబల్ స్టిక్కర్ వేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును దుర్వినియోగం చేస్తున్న పోకిరీలు. యథేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి రద్దీ రోడ్డులో స్పీడ్ గా కారు తో లుతూ మిగతా వాహనదారులను భయబ్రా ంతులకు గురిచేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పా టించని వాహనదారులపై కఠిన చర్యలు తీ సుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.