5 April, 2026 | 6:17 AM

కావూరి హిల్స్‌లో మిర్రర్స్ లగ్జరీ సెలూన్స్

05-04-2026 12:00 AM

ప్రారంభించిన సినీ నటి రాశీఖన్నా

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): టాలీవుడ్ సెలెబ్రిటీలు మాదాపూర్ లోని  కావూరి హిల్స్‌లో సందడి చేసారు. ఇక్కడి జ్యోతి రిడ్జ్‌లో నూతనంగా ఏర్పాటైన మిర్రర్స్ లగ్జరీ సెలూన్‌ను టాలీవుడ్ నటి రాశీఖన్నా ప్రారంభించగా, ప్రముఖ దర్శకులు కే రాఘవేంద్రరావు, బి గోపాల్, ఏ కోందడరామిరెడ్డి, ఎస్ గోపాల్‌రెడ్డి, కొరటాల శివ, మురళీ మోహన్, వీవీ వినాయక్ హాజరయ్యారు.

అలాగే నటులు శ్రీకాంత్, నవదీప్, శ్రీ నందు, రాజా రవీంద్ర, శివాజీ రాజా, చాందినీ చౌదరి, దివి వాద్య, దక్ష నాగర్కర్, బిందు మాధవి, తేజస్విని మడివాడ, సంజనా గర్లాని, అలాగే ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి, హాస్యనటులు అలీ, సునీల్ పలువురు ఈ  ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కుమన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం సంతరించుకుంది.

ఈ సందర్భంగా మిర్రర్స్ లక్జరీ సెలూన్ ఫౌండర్ డాక్టర్ గూడపాటి విజయలక్ష్మి మాట్లాడుతూ.. అందంగా ఉండాలనేది అందరి కోరిక.. ఇందుకు లగ్జరీకి తగ్గా స్కిన్, హెయిర్, గ్రూమింగ్‌లో విభిన్నమైన సేవలను అందించడంలో ముందున్నామన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద సలోన్లలో ఒకటి అని, అంతర్జాతీయ స్థాయి సేవలు, అత్యుత్తమ సదుపాయాలతో లండన్, పారిస్ వంటి నగరాల్లో మాత్రమే లభించే అనుభూతిని ఇప్పుడు హైదరాబాద్లోనే అందిస్తోందని చెప్పారు.

గత 20 ఏళ్లుగా లోరియల్ ప్రొఫెషనల్ తో కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తూ, ప్రపంచ ప్రఖ్యాత కేరస్టాస్ ఉత్పత్తులను వినియోగించి అధునాతన స్కాల్ప్ థెరపీలు, హెయిర్ డ్యామేజ్ రిపేర్, రీస్టోరేటివ్ హెయిర్ కేర్ సేవలను అందించడానికి మిర్రర్స్ శ్రీకారం చుట్టిందన్నారు.