28 March, 2026 | 3:56 PM

గవర్నర్‌కు ఘన స్వాగతం

28-03-2026 02:21 PM

భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు(Telangana Governor Shiv Pratap Shukla) శనివారం సారపాక ఐటీసీ హెలిపాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ గవర్నర్కు స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక క్రతువులో పాల్గొనేందుకు  విచ్చేసిన గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పట్టాభిషేక వేడుకల నిమిత్తం భద్రాద్రి ఆలయానికి బయలుదేరారు గ్రామంలో కట్టదుట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.