21 April, 2026 | 1:21 AM

పనులు నాణ్యతతో నిర్ణీతకాలంలో పూర్తి చేయాలి

21-04-2026 12:00 AM

రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం 44వ డివిజన్‌లో 1.5 కోట్లతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): నగర అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్లో కోటి 50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ప్రజల అంగీకారంతో అవసరమైన చోట్ల రోడ్డు విస్తరణ పనులు చేపడతామని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూనుకొల్లు నీరజ, కమీషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమీషనర్ అనిల్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.