Auto Strike: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: పొన్నం
- పాత ఆటోలున్న వారికి గుడ్ న్యూస్..
- ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు సర్కార్ సాయం
- ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
- ఆటో కార్మికులు సమ్మెను వెనక్కి తీసుకోవాలి
- డీజిల్, పెట్రోల్ ఆటోలను రేటిరోఫిట్ మెంట్ కు కొత్తపథకం
హైదరాబాద్: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) హామీ ఇచ్చారు. ఆటో కార్మికులు సమ్మెను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను రేటిరోఫిట్ మెంట్ కు కొత్త పథకం తెస్తామని సూచించారు. 2015 తర్వాత ఆటో ఛార్జీలు పెంచలేదని మంత్రి వెల్లడించారు. ఖర్చులు పరిగణనలోకి తీసుకుని ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు. ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా అధికారులను భాగస్వామ్యం చేస్తామని సూచించారు.
అన్ని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేబినెట్ లో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అవసరమైన విధివిధానాలు రూపొందించి బోర్డు ఏర్పాటు చేస్తామన్న మంత్రి పొన్నం పాత ఆటో స్క్రాప్ చేసి ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. దశలవారీగా ఎలక్ట్రిక్ ఆటోలు ప్రోత్సహించడమే ప్రజా ప్రభుత్వ లక్షమని తెలిపారు.






