యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పెంచాలి: మంత్రి కోమటిరెడ్డి
21-04-2026 10:45 AM
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పర్యటించారు. రబీ ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పెంచాలని కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు పెంచాలన్నారు. రాత్రి, పగలు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపాలన్నారు. ధాన్యం ఎక్కువ వచ్చే గ్రామాలకు ఎక్కువ లారీలు పంపాలని సూచించారు. రోడ్లపై ధాన్యం పోయకుండా స్కూల్లు, ఫంక్షన్ హాళ్ల వద్ద కేంద్రం పెట్టాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ ఉండేలా చూడాలని చెప్పారు. నల్గొండ పరిధిలో 2.30 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి అంచనా వేశారు.






