21-02-2026 01:19:38 AM
కృత్రిమ మేధ పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ అవసరం
ఇండియాను ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా మార్చాలి
ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఏఐ వర్సిటీని స్థాపించాలి
తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం
ఢిల్లీలోని ఏఐ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్‌మ్యాప్ అవసరం. ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం --రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ‘ఏఐ వార్ రూమ్’ ఏర్పాటు చేయాలి. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది.
- సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముం దంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వం లో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీ య భద్రత వంటి అంశాలను సమగ్రం గా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో ప్రసంగించిన సీఎం మానవ చరిత్రలో అగ్ని చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని అభివర్ణించారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుం డా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని పేర్కొన్నారు.
రోబోటిక్స్‌తో కలిసినప్పుడు యంత్రాలు మానసిక మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో ‘ఏఐ వార్ రూమ్’..
దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్‌మ్యాప్ అవసరమని ఆయన నొక్కిచెప్పారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో--- సెమీకండక్టర్ చిప్ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెం టర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు, అప్లికేషన్లు ---భారత్ స్పష్టమైన వ్యూ హంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ పరిణామాల ను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం --రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ‘ఏఐ వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించా రు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్ర పంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సూచించారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉ పాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావి స్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని తెలిపారు. అయితే సరైన రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టించబడే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని అభిప్రాయపడ్డా రు.
యువతను ఏఐ- ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్‌ల కు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రం గా నిలిచే ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ర్టం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గ నిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు.
ఏఐ అభివృద్ధి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్ర జా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవి ష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవ స్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.