1 July, 2026 | 7:00 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

భారత్‌పై మెక్సికో 50శాతం సుంకాలు

12-12-2025 01:51 AM
  1. జనవరి 1 నుంచి అమల్లోకి 

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికేనా..?

3.76 బిలియన్ల ఆదాయమే లక్ష్యం

భారత్, దక్షిణ కొరియా, చైనా, థాయాలాండ్, ఇండోనేషియాపై ప్రభావం

మెక్సికోసిటీ, డిసెంబర్ 11: ఇప్పుడు మెక్సికో భారతదేశంపై 50% సుంకాలను విధిస్తోంది. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ సుంకాల పెంపుతో, భారతీయ దిగుమతులపై 50% వరకు సుంకాలు విధించబడతాయి. యుఎస్-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం యొక్క తదుపరి సమీక్షకు ముందు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికే ఈ చర్య అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ దిగుమతులపై అమెరికా విధించిన అధిక 50% సుంకాల తర్వాత, తీవ్రమవుతున్న ప్రపంచ వాణిజ్య యుద్ధం మధ్య భారత్‌పై భారీ సంకాలను మెక్సికో వేస్తోంది.

బుధవారం, మెక్సికో సెనేట్ భారతదేశం, చైనా తదితర అనేక ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక రకాల వస్తువులపై 50% వరకు సుంకాలను ఆమోదించిందని ఓ అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఇదంతా ట్రంప్‌ను సంతోషపెట్ట డానికేనని అనిపిస్తోందని పేర్కొంది. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ సుంకాల పెంపుతో, మెక్సికోతో వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుండి వచ్చే ఆటోలు, ఆటో విడిభాగాలు, వస్త్రాలు, ప్లాస్టిక్స్, ఉక్కు వంటి వస్తువులపై 50% వరకు సుంకాలు విధించబడతాయి.

దీంతో భారత్, దక్షిణ కొరియా, చైనా, థాయ్లాండ్, ఇండోనే షియా వంటి దేశాలు ప్రభావితమవుతాయి. ఈ సంకాల ద్వారా వచ్చే ఏడాది అదనంగా 3.76 బిలియన్ల డాలర్ల (సుమారు రూ.33,910 కోట్లు) ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యుఎస్- మెక్సికో -కెనడా వాణిజ్య ఒప్పందం (యూఎస్‌ఎంసీఏ)పై వాషింగ్టన్ సమీక్షకు ముందు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికే ఈ చర్య అని విశ్లేషకులు తెలిపారు. అయితే, కొన్ని నెలలుగా షైన్బామ్ ప్రభుత్వంపై ట్రంప్ ఆందోళనలను లేవనెత్తుతూనే ఉన్నారు. నిరంతరం విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం.