28 August, 2026 | 2:27 PM

Breaking News

రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు   •   ప్రధాని మోదీ, తల్లిదండ్రులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్   •   ఎమ్మెల్యే పోచారంకు రాఖీ కట్టిన సోదరిమణి దొడ్ల సత్యవతి   •   విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో భవిష్యత్ పోరాటాలు   •   ప్రయాణికుల కష్టాలు తీర్చేలా ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి   •   సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు   •   మదర్‌ థెరిసా పొదుపు సమితిపై ఆరోపణల కలకలం   •   పేద విద్యార్థులకు డాక్టర్ సంతోష్ రెడ్డి ఆర్థిక సహయం   •   జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •  

మెస్సీ మరో చరిత్ర

05-07-2026 12:21 AM
  1. 20 ప్రపంచకప్ గోల్స్
  2. మారడోనా రికార్డు బ్రేక్

మియామి, జూలై 4 : అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. కాబో వెర్డేతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో గోల్ చేయడం ద్వారా వరుసగా  ప్రపం చ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా మెస్సీకి ఇది 20వ ఫిఫా వరల్డ్ కప్ గోల్. ఈ గోల్‌తో అతడు దిగ్గజ ఆటగాడు మారడోనా పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఒక మ్యాచ్‌లో అత్యధిక అసిస్ట్స్ నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్ కొట్టిన మెస్సీ తర్వాత ప్రతీ మ్యాచ్‌లోనూ గోల్ సా ధించాడు. దీంతో ఫిఫా ప్రపంచకప్ లీడింగ్ గోల్ స్కోరర్‌గా తన రికార్డును మరింత మె రుగుపర్చుకున్నాడు. ఈ గోల్‌తో మెస్సీ గోల్డె న్ బూట్ అవకాశాలను కూడా మరింత మె రుగుపర్చుకున్నాడు.

ఈ గోల్ ప్రస్తుత ప్రపంచకప్ ఎడిషన్లో మెస్సీకి 7వది. గోల్డెన్ బూట్ రేసులో ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబపే 6 గోల్స్‌తో తర్వాతి స్థానంలో ఉన్నాడు. రెం డు వేర్వేరు ప్రపంచ కప్ టోర్నీల్లో ఏడేసి గో ల్స్ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గానూ మరో అ  రుదైన రికార్డు నెలకొల్పాడు. 2022 ఖతార్ ప్రపంచ కప్‌లో ఏడు గోల్స్ చేసిన మెస్సీ ప్ర స్తుతం జరుగుతున్న 2026 ప్రపంచ కప్‌లో నూ ఇప్పటికే ఏడో గోల్ నమోదు చేశాడు.