తాడ్వాయిలో వివాహిత ఆత్మహత్య
తాడ్వాయి,(విజయక్రాంతి): గత ఆరు నెలల నుంచి అనారోగ్యం, నిద్రలేమి,మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తాడ్వాయి ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.... గ్రామానికి చెందిన స్వాతి (35) అనే వివాహిత తన నివాసంలో శనివారం ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆమె గత ఆరు నెలల నుంచి అనారోగ్యం, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. మృతురాలు రాసిపెట్టిన సూసైడ్ నోట్ లో తన ఆరోగ్యం బాగాలేదని తన ఆరోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి పెట్టి ఉందని తెలిపారు. ఆరోగ్యం బాగా లేనందున ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నోట్ లో రాసి పెట్టి ఉండన్నారు. తన మరణానికి ఎవరు బాధ్యులు కారని ఆమె నోట్ లో పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు. ఈ విషయమై తల్లి రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.






