13 May, 2026 | 3:58 AM

జోరుగా మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్

13-05-2026 12:04 AM
  1. రెండో రోజు ఉత్సాహంగా కొనసాగిన పోటీలు
  2. నేడు ఫైనల్ మ్యాచ్‌కు భారీ ఏర్పాట్లు

వెంకటాపూర్, మే 12 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని పోటీలకు మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. క్రీడాకారుల సౌకర్యార్థం వెంకటాపూర్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో టెంట్ల సదుపాయం కల్పించడంతో పాటు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు మంచినీటి సదుపాయం మరియు భోజన వసతులు ఏర్పాటు చేశారు. నేడు టోర్నమెంట్ మూడవ రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు ఎస్త్స్ర చల్లా రాజు తెలిపారు. మండలంలోని క్రీడాకారులందరూ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం హాజరై పోటీల్లో పాల్గొనాలని కోరారు.

ఈ టోర్నమెంట్లో విజేతలకు ప్రథమ బహుమతిగా ట్రోఫీతో పాటు రూ.3,000 నగదు పారితోషకం, ద్వితీయ బహుమతిగా ట్రోఫీతో పాటు రూ.2,000 నగదు బహుమతి అందజేయనున్నారు. అదేవిధంగా మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపించనున్నట్లు ఎస్త్స్ర చల్లా రాజు తెలిపారు.